Sunday, January 19, 2025
HomeసినిమాHari Hara Veera Mallu: వీరమల్లు వెనుక ఏం జరుగుతోంది..?

Hari Hara Veera Mallu: వీరమల్లు వెనుక ఏం జరుగుతోంది..?

పవన్ కళ్యాణ్‌ రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో చిత్రాలతో ఆకట్టుకున్న పవన్.. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు’ చిత్రాలు చేస్తున్నారు. ఈ మూడు సినిమాల్లో ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ ముహుర్తాన ప్రారంభించారో కానీ.. గత కొన్ని సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటునూ ఉంది కానీ.. పూర్తి కాలేదు. ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ క్లారిటీ లేదు.

అయితే.. ఇది రీమేక్ మూవీ కాదు.. స్ట్రెయిట్ మూవీ కావడం.. అలాగే ఇది భారీ పీరియాడిక్ మూవీ కావడంతో చాలా అంచనాలు ఉన్నాయి కానీ.. ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో నిర్మాత కూడా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు పవన్ పొలిటికల్ గా బిజీ అయ్యారు. అయినప్పటికీ సినిమాలకు డేట్స్ ఇస్తున్నారు. ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ కు డేట్స్ ఇవ్వడంతో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఓజీ సినిమాకి కూడా డేట్స్ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి.

నవంబర్ లో మరింత బిజీ కానున్నారు. అందుచేత సమ్మర్ తర్వాతే వీరమల్లు సినిమాకి డేట్స్ అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. అందుకనే క్రిష్ వేరే ప్లానింగ్ లో ఉన్నారని తెలిసింది. సమ్మర్ లోపు క్రిష్‌ ఓ వెబ్ సిరీస్ చేస్తారట. దీనికి సంబంధించిన కథను రెడీ చేసుకున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నారని తెలిసింది. మరో వైపు వీరమల్లు తర్వాత చేసే సినిమాకి సంబంధించి కథాచర్చలు కూడా జరుగుతున్నాయట. ఓ యంగ్ హీరోతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారని కూడా తెలిసింది.

అసలు వీరమల్లు తర్వాత స్టార్ట్ అయిన సినిమాలు పూర్తవ్వడం.. రిలీజ్ అవ్వడం కూడా జరిగాయి కానీ.. వీరమల్లుకే ఎందుకు ఇలా జరుగుతుంది. అసలు దీని వెనుక ఏం జరుగుతోంది అనేది ఆసక్తిగా మారింది. ఇది పీరియాడిక్ మూవీ కావడంతో సెట్స్ వర్క్, గ్రాఫిక్ వర్క్ ఎక్కువుగా ఉందట. దీనికి తోడు పవర్ స్టార్ గెటప్ కూడా డిఫరెంట్ గా ఉండాలి. దీనికి తోడు పవన్ ఇప్పుడు ఫ్యాన్స్ కోరుకునే పక్కా కమర్షియల్ మూవీ అందివ్వాలి అనుకుంటున్నారట. అందుకనే వీరమల్లు కంటే ముందు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పూర్తి చేయాలి అనుకుంటున్నారట. పాపం.. క్రిష్ గత కొన్ని సంవత్సరాలుగా వీరమల్లు అంటూ ఈ సినిమాతోనే ఉన్నారు. మరి.. వీరమల్లు ఎప్పుడు పూర్తవుతందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్