పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో ‘OG’ మూవీ ఇటీవల సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి అసలు OG అంటే ఏంటి..? ఈ స్టోరీ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. OG అంటే.. ఓరిజినల్ గ్యాంగ్ స్టర్ అని.. ఈ మూవీ గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో సాగే పవర్ ఫుల్ యాక్షన్ స్టోరీ అని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది.
మరో ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. తొలి భాగాన్ని త్వరగా పూర్తి చేసి ఈ దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీని కోసం భారీగా పవన్ డేట్స్ కోవాలని సుజిత్ కోరారట. పవన్ 35 రోజులు డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. ఈ తొలి భాగంలో ఓ టెర్రిఫిక్ క్లైమాక్స్‌ను ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అదే ఈ చిత్రానికి హైలైట్ కానుందట. ఎలాగైనా ఈ చిత్రం హిట్ కొట్టి భారీగా కమ్ బ్యాక్ ఇవ్వాలని సుజిత్ భావిస్తున్నారట. ఈ సినిమా అనౌన్స్ మెంట్ తోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలవడంతో భారీగా అంచనాలు ఉన్నాయి.
సాహో లాంటి హై యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత దాదాపు నాలుగేళ్లు విరామం తీసుకుని సుజిత్ ఈ కథను సిద్ధం చేశాడు. ఇందులో పవన్ గ్యాంగ్స్ స్టర్ గా చాలా పవర్ ఫుల్ గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. పైగా అతడు పవన్ కు సుజీత్ వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఏ లెవల్లో ఉంటుందో అని అభిమానులందరూ భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఇంకా ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్ అందుకున్న తర్వాత డీవీవీ.. ఈ సినిమా చేయడం కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి.. సుజిత్ పవన్ ను పవర్ ఫుల్ గా ఎలా చూపిస్తారో..? అనుకున్నట్టుగా దసరాకి వస్తుందో లేదో.?