విశాఖ గర్జనకు ఉత్తరాంధ్ర రైతులు సంపూర్ణ మద్దతు ప్రకటించారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.  విశాఖలో పరిపాలనా రాజధాని పెట్టాలని సిఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని, దీనికి  రెండేళ్లుగా కొందరు ఇబ్బందులు పెడుతూనే ఉన్నారని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అవంతి, పొలిటికల్ జేఎసి నేతలతో కలిసి విశాఖ గర్జన పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుడివాడ మాట్లాడుతూ…  పాదయాత్రగా వస్తున్న వారు  వారికి ఏమి కావాలో చెప్పుకోవాలి గానీ, విశాఖ రాజధాని వద్దని చెప్పే హక్కు లేదని స్పష్టం చేశారు. వారు మనమీదకు ఓ దండయాత్రలాగా వస్తున్నప్పుడు కూడా మనం చేతులు ముడుచుకు కూర్చుంటే బావితరాలు మనల్ని క్షమించబోవని గుడివాడ హెచ్చరించారు.  తాము గానీ, ఇక్కడ ఉన్న మేధావులు కానీ ఎవ్వరం కూడా స్వార్ధం కోసం రాలేదని, ఈ ప్రాంత ప్రయోజనాల కోసమే ముందుకు వచ్చామని, తమ ప్రాంత ఉనికి చాటి చెప్పేలా విశాఖ గర్జన ఉంటుందని  అమర్నాథ్ చెప్పారు.

విశాఖ రాజధాని కావాలని, మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్న విషయాన్నిఇక్కడి టిడిపి నేతలు చంద్రబాబుకు చెప్పాలని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు సూచించారు. రాజధాని అంటే అమరావతి  ఒక్కటేనా? రాష్ట్రం అంటే అక్కడి 29 గ్రామాలేనా అని ప్రశ్నించారు. విశాఖ గర్జన పెట్టగానే పవన్ కళ్యాణ్ నిద్ర లేచారని, జనవాణి పెట్టుకున్నారని, ఇన్నాళ్ళూ విశాఖలో జనం ఉన్నారనే విషయం మర్చి పోయారని… గాజువాకలో పవన్ ఓడిపోయినా రెండో స్థానంలో వచ్చారని, చాలా మంది ప్రజలు ఆయనకు ఓటేశారని ఈ విషయాన్ని అయన గుర్తు పెట్టుకోవాలని కోరారు. పవన్ తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని మరో రోజు పెట్టుకోవాలన్నారు.

Also Read : వచ్చే ఏడాది నుంచి విశాఖ ‘పరిపాలన’: గుడివాడ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *