ప్రపంచ ప్రసిద్ధి చెందిన చిత్రకారుడు పాబ్లో పికాసో ఇంటికి ఆయన మిత్రుడొకడు వచ్చాడు.
అతనికి ఇల్లంతా చూపించారు పికాసో.
అనంతరం మిత్రుడు “అంతా బాగానే ఉంది కానీ ఇంట్లో ఒక్క పికాసో పెయింటింగ్ కూడా లేదేమిటీ? నీకవి నచ్చవా?” అడిగాడు.
పికాసో “నాకిష్టమే. కానీ పికాసో పెయింటింగులు ఇక్కడ పెట్టుకునేంత స్థోమత నాకు లేదు. ఆ పెయింటింగుల ధర నేను భరించలేను” అంటూ చిన్ననవ్వు నవ్వారు.
నవ్వితే నవ్వి ఉండొచ్చు కానీ పికాసో పెయింటింగ్ ఒకటి కొన్ని సంవత్సరాల క్రితం న్యూయార్కులో నిర్వహించిన వేలంపాటలో 1148 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. ఆ పెయింటింగ్ శీర్షిక :
WOMEN OF ALGIERS !! అప్పుడా పెయింటింగు ధర ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయినట్టు కొత్త రికార్డు నమోదైంది. పికాసో ఈ పెయింటింగుని 1955లో వేశారు.
– యామిజాల జగదీశ్
Also Read :