నేటి తెల్లవారు ఝామున మరణించిన కన్నుమూసిన రెబెల్ స్టార్ కృష్ణం రాజు భౌతిక కాయానికి పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణా ఐటి మంత్రి కేటిఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు, సూపర్ స్టార్ కృష్ణ, విలక్షణ నటుడు మోహన్ బాబు, హీరోలు చిరంజీవి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, గోపీచంద్, తదితరులు జూబ్లీహిల్స్స్ లోని అయన నివాసంలో పార్ధీవ దేహాన్ని సందర్శించి పూల మాల సమర్పించి నివాళులు అర్పించారు. కృష్ణంరాజు సతీమణి తో పాటు హీరో ప్రభాస్ ను వారు ఓదార్చారు.