Saturday, January 18, 2025
HomeసినిమాPooja Hegde: పూజా హేగ్డేకు బిగ్ ఛాన్స్. ఈసారైనా కలిసొస్తుందా..?

Pooja Hegde: పూజా హేగ్డేకు బిగ్ ఛాన్స్. ఈసారైనా కలిసొస్తుందా..?

పూజా హేగ్డే.. ఒకప్పుడు వరుసగా బిగ్ స్టార్స్ తో సినిమాలు చేసింది. వరసగా సక్సెస్ సాధించింది. ఆడియన్స్ లోనూ, ఇండస్ట్రీలోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత ఈ అమ్ముడకు ఎందుకనో అదృష్టం కలిసి రావడం లేదు. ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమా చేసింది.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. చిరంజీవి, చరణ్ కాంబో మూవీ ఆచార్యలో నటించింది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. సల్మాన్ ఖాన్ తో కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీలో నటించింది. ఈ సినిమా కూడా అంతే ఫ్లాప్ అయ్యింది.

ఇలా వరుసగా ఫ్లాపులతో కెరీర్ లో బాగా వెనకబడింది. ఇలాంటి టైమ్ లో మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. అమ్మడు మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్టు అనుకున్నారు కానీ.. లాస్ట్ మినిట్ లో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి కూడా పూజా హేగ్డే తప్పుకుంది. ఇలా రెండు భారీ, క్రేజీ సినిమాలు మిస్ అయ్యింది. పూజా చేతిలో సరైన సినిమా లేదు. ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ నుంచి కాల్ వచ్చిందట. షాహిద్ కపూర్ హీరోగా ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రాబోతుంది.

ఈ చిత్రానికి మలయాళీ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ దర్శకత్వ వహిస్తున్నారు. కోయి షక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో కథానాయికగా పూజా హేగ్డేను తీసుకున్నారట. అయితే.. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే పూజా పేరును అనౌన్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. కొన్నాళ్లుగా పూజాకు అదృష్టం కలిసి రావడం లేదు. మరి.. ఈసారైనా లక్ కలిసొస్తుందా..? సక్సెస్ సాధించి మళ్లీ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్