కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో విజయం సాధించి సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఒక్క కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్స్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ ‘సలార్’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. విదేశాల్లో క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 28న సలార్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందే ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఆతర్వాత మళ్లీ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. సలార్ మూవీ చేస్తున్నప్పుడే సీక్వెల్ కు సంబంధించి కొంత పార్ట్ షూటింగ్ చేశారట. ఇంకా చేయాల్సిన షూట్ ను ఎన్టీఆర్ మూవీ తర్వాత చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని 2026లో విడుదల చేయాలి అనుకుంటున్నారట.
సలార్ 2 తర్వాత కేజీఎఫ్ 3 మూవీ చేయాలనేది ప్లాన్. కేజీఎఫ్ 2 మూవీ ఎండింగ్ లో కేజీఎఫ్ 3 ఉంటుందని హింట్ ఇచ్చారు. యశ్ కూడా కేజీఎఫ్ 3 కోసం వెయిట్ చేస్తున్నాను కానీ… సెట్స్ పైకి రావడానికి టైమ్ పడుతుందని ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు. ఈ మూవీని 2028లో రిలీజ్ చేయాలనేది ప్లాన్ అని టాక్. ఇక కేజీఎఫ్ పార్ట్ 3 తర్వాత భారీ మల్టీ స్టారర్ చేసే అవకాశం ఉందని తెలిసింది. మొత్తానికి ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అదిరింది.