Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్Badminton-Australian Open: కిడాంబికి రాజావత్ షాక్

Badminton-Australian Open: కిడాంబికి రాజావత్ షాక్

బాడ్మింటన్ ఆస్ట్రేలియన్ ఓపెన్-2023 లో నేడు జరిగిన మ్యాచ్ లో కిడాంబి శ్రీకాంత్ కు మన దేశానికే చెందిన ప్రియాన్షు రాజావత్ షాక్ ఇచ్చాడు. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పురుషుల సింగిల్స్  మ్యాచ్ లో శ్రీకాంత్ పై 21-13; 21-8 తో రాజావత్ విజయం సాధించాడు.  మరో మ్యాచ్ లో  హెచ్ ఎస్ ప్రణయ్…వరల్డ్ నంబర్ వన్ అంటోనీ గింటింగ్ పై విజయం నమోదు చేశాడు. 16-21తో తొలి సెట్ కోల్పోయినా  ఆ తర్వాత తేరుకొని 21-17; 21-14తో విజయం సాధించి టాప్-4 లో అడుగు పెట్టాడు.

కాగా, పివి సింధు ఓటమి పాలైంది. అమెరికా ప్లేయర్ బీవెన్ ఝంగ్ 21-12;21-17 తో సింధుపై గెలుపొందింది.

రేపు జరిగే సెమీస్ మ్యాచ్ లో ప్రణయ్- రాజావత్ లు తలపదనుండడం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్