అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’పై భారీ అంచనాలున్నాయి. ఇటీవల బన్నీ బర్త్ డేకు విడుదల చేసిన గ్లింప్స్ తక్కువ టైమ్ లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ కన్నా బాలీవుడ్ లో ‘పుష్ప 2’పై ఆసక్తి నెలకొంది. వచ్చే సమ్మర్ లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే.. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే రికార్డుల వేట మొదలుపెట్టింది. ‘పుష్ప’ విజయంలో ఆడియో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు పుష్ప 2 ఆడియోను అంతకు మించి అనేలా రెడీ చేస్తున్నారు. టీ సిరీస్ సంస్థ ఈ సినిమా అన్ని భాషల ఆడియో రైట్స్ ను దాదాపు 65 కోట్లకు కొనుగోలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇండియన్ సినిమా హిస్టరిలో ఇదే రికార్డ్. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సైతం.. 30 కోట్లే వచ్చాయి. దీనికి రెట్టింపు ధరను పుష్ప 2 సొంతం చేసుకొన్నట్టే.
బన్నీ, సుకుమార్, దేవిశ్రీ.. ఈ కాంబో ఎప్పుడు సినిమా చేసినా మ్యూజికల్ హిట్టే.. అలాగే పుష్ప సినిమా ఆడియో టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా హిట్ అయ్యింది. అన్ని భాషల్లోనూ పుష్ప ఆడియో హిట్ అవ్వడం వలనే పుష్ప 2 ఆడియో రైట్స్ ఈ రేంజ్ లో రికార్డు రేటుకు అమ్ముడు పోయాయి. పుష్ప 2 రిలీజ్ కాకుండా రికార్డుల వేట మొదలైంది. ఇక రిలీజ్ తర్వాత పుష్ప 2 ఎలాంటి రికార్డులను సెట్ చేస్తుందో..?