Sunday, January 19, 2025
Homeసినిమామార్చి 4న రాధేశ్యామ్?

మార్చి 4న రాధేశ్యామ్?

Date Fixed: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే క‌థానాయిక‌. ఈ భారీ పిరియాడిక్ ల‌వ్ స్టోరీ ఎప్పుడో ప్రేక్ష‌కుల ముందుకు రావాలి కానీ.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుద‌ల అంటూ రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. మ‌రి.. రాధేశ్యామ్ రిలీజ్ ఎప్పుడంటే… అఫిషియ‌ల్ గా ఇంకా డేట్ అనౌన్స్ చేయ‌లేదు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆర్ఆర్ఆర్ కంటే ముందుగా రాధేశ్యామ్ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ఫిక్స్ అయ్యార‌ని తెలిసింది. మార్చి 4న రాధేశ్యామ్ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్ర నిర్మాణ సంస్థ యు.వి.క్రియేష‌న్స్ నిర్ణ‌యం తీసుకుంద‌ని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా… ఆల్రెడీ డిస్ట్రిబ్యూట‌ర్స్ కు మార్చి 4న రాధేశ్యామ్ రిలీజ్ అని చెప్పార‌ని.. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ను అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Also Read : ‘రాధే శ్యామ్’కు థమన్ రీ రికార్డింగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్