Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఆ వార్తల్లో నిజం లేదు: ద్రావిడ్

ఆ వార్తల్లో నిజం లేదు: ద్రావిడ్

No way:  భారతీయ జనతా యువమోర్చా సమావేశాలకు తాను హాజరవుతున్నట్లు వచ్చిన వార్తలను టీమిండియా హెడ్ కోచ్ రాహూల్ ద్రావిడ్ ఖండించాడు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టి పారేశాడు. ‘మే 12 నుంచి 15 వరకూ హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతోన్న బిజెపి యువజన విభాగం జాతీయ కార్యవర్గ సమావేశాలకు తాను హాజరవుతున్నరంటూ కొన్ని మీడియా సంస్థలు వెలువరించిన వార్తల్లో నిజం లేదు’ అని ద్రావిడ్ స్పష్టం చేశారు.

బిజెపి ధర్మశాల ఎమ్మెల్యే విశాల్ నేహ్రియా మీడియాతో మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా బిజెపి యువమోర్చా సమావేశాలు నిర్వహిస్తున్నామని, బిజెపి అగ్రనేతలతో పాటు పలువురు కేంద్రమంత్రులు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన పలువురు కూడా పాల్గొంటున్నారని చెప్పాడు.  క్రికెట్  టీమిండియా ప్రధాన కోచ్ రాహూల్ ద్రావిడ్ కూడా వస్తున్నారని, అయన మార్గదర్శకత్వం యువమోర్చా కార్యకర్తలకు స్పూర్తిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.  అయితే ఈ వార్తలను ద్రావిడ్ ఖండించాడు.

ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని బిజెపి, మరోసారి అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీలు ఆశిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్