Friday, April 26, 2024
HomeTrending Newsరాహుల్ ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలి - సీఎల్పీ నేత భట్టి

రాహుల్ ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలి – సీఎల్పీ నేత భట్టి

ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టి.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు  పాదయాత్ర చేసి దేశ ప్రజలకు భరోసా కల్పించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా వైఫల్యాలపై దనుమాడారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశ నిర్మాణానికి సంబంధించి నేర్పు, విజన్  ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న సందర్భంలో.. ‘‘దేశానికి ముప్పు ఉందని  త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ప్రజానీకం మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ అని రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, కేంద్ర  ప్రభుత్వాన్ని హెచ్చరించినా పెడచెవిన పెట్టారు. రాహుల్ గాంధీ విజన్ ను, ఆయన మాటలను దేశ ప్రధాని మోదీ పట్టించుకుని ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవని భట్టి చెప్పారు.

దేశంలో ప్రభుత్వ రంగ వ్యవస్థల ద్వారా అనేక రకాల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు సృష్టించాయని భట్టి గుర్తు చేశారు. మోదీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టి ఉద్యోగాలు లేకుండా చేశారు.  ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానిక పెట్టడం ద్వారా దేశ నిర్మాణాన్ని మోదీ ఫణంగా పెట్టారని విమర్శించారు.

లాక్ డౌన్ పెట్టడంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల లక్షలమంది వలస కూలీలు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అందరికీ తెలిసిందేనని చెప్పారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ కొన్ని నెలలుగా దీక్షలు, ధర్నాలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. జాతిని ఏకం చేసే శక్తి కాంగ్రెస్ కి మాత్రమే ఉందని భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డిలు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్