Saturday, April 5, 2025
Homeసినిమారాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ చిత్రం ప్రారంభం

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ చిత్రం ప్రారంభం

New Pair: విలక్షణ కథలతో కంటెంట్ ఓరియంటెడ్ గా సినిమాలు నిర్మిస్తూ భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి సంచలన విజయాలతో దూసుకుపోతూ పక్కా కమర్షియల్ లాంటి కమర్షియల్ సినిమాతో మ‌రో మారు ప్రేక్ష‌కుల ముందుకు వస్తుంది ప్రతిష్ఠాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్. జోహార్, అర్జున ఫల్గుణ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలు తెరకెక్కించిన తేజ మార్ని దర్శకత్వంలో యువ నిర్మాత బన్నీ వాస్ నిర్మాణంలో ఓ చిత్రం రూపొందిస్తుది.

ఈ చిత్రం నేడు హైద‌రాబాద్ ఫిల్మ్ న‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూర్తిగా కంటెంట్ ప్రధానంగానే ఈ సినిమా కథ సాగుతుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. భాను ప్ర‌తాప్ సహ నిర్మాత‌, ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్