Sunday, January 19, 2025
Homeసినిమాపవన్ కు రకుల్ షాక్ ఇచ్చిందా..?

పవన్ కు రకుల్ షాక్ ఇచ్చిందా..?

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో ‘బ్రో’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. ఈ క్రేజీ మూవీ దాదాపు పూర్తయ్యింది. రెండు పాటలు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ రెండు పాటల్లో ఒక పాట స్పెషల్ సాంగ్. ఈ పాటను పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ఇద్దరి పై చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ మూవీని జులై 28న విడుదల చేయనున్నారు.

అయితే… ఈ స్పెషల్ సాంగ్ కోసం ఎవర్ని తీసుకోవాలా అని చాలా పేర్లు పరిశీలించారు. తమన్నా, శృతిహాసన్ ఇలా చాలా పేర్లు పరిశీలించారు. శృతిహాసన్ కన్ ఫర్మ్ అనుకున్నారు. అలాగే దిశా పటానీ పేరు కూడా వినిపించింది. ఆఖరికి రకుల్ ప్రీత్ సింగ్ ను ఫైనల్ చేసారు. తెలుగు సినిమాలకు ఇటీవల కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకనో దూరంగా ఉంటుంది కానీ ఇప్పుడు బ్రో మూవీలో స్పెషల్ సాంగ్ చేసేందుకు మాత్రం ఓకె చెప్పిందట. ఈ సోమవారం షూట్ వుంది కానీ శుక్రవారం సమాచారం అందింది. తనకు డేట్ లు అడ్జస్ట్ కావడం లేదని. దీంతో యూనిట్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదట.

ఇంకా చెప్పాలంటే… రకుల్ సమాధానంతో బ్రో యూనిట్ కు షాక్ తగిలినట్టు అయ్యిందట. ఇదే విషయం పవన్ కు చెబితే ఆయన కూడా షాక్ అయ్యారట. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడు డేట్స్ ఇస్తుందో అప్పుడు పవన్ ను డేట్స్ అడగడమా..? లేక వేరే హీరోయిన్ ను చూసుకోవడమా..? ఏం చేయాలని బ్రో మేకర్స్ ఆలోచనలో పడ్డారట. మరో వైపు ఊర్వశీ రౌతాలను కూడా పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రకుల్ బ్రోకు పెద్ద షాకే ఇచ్చింది. మరి.. పవన్, తేజ్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో నటించే లక్కీ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్