మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆర్ ఆర్ ఆర్ లోని ‘నాటు-నాటు’పాటకు ఆస్కార్ లభించిన తరువాత చిత్ర బృందం అంతా నేరుగా హైదరాబాద్ చేరుకోగా చరణ్ మాత్రం ఢిల్లీలో ఆగాడు. ఆర్ ఆర్ ఆర్ అద్భుత విజయం సాధించినందుకు, ఆస్కార్ అవార్డు గెల్చుకున్నందుకు రామ్ చరణ్ ను అమిత్ షా అభినందించారు.


గతంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఇదే సినిమాలో మరో హీరోగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ ను కలుసుకున్న సంగతి తెలిసిందే.