భారతీయ సినిమాలను జపాన్ ఆడియన్స్ బాగా ఆదరిస్తుంటారు. పాతకేళ్ల క్రితం రజనీకాంత్ నటించిన ‘ముత్తు’ జపాన్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవలి ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చే వరకు ‘ముత్తు’ సినిమానే రికార్డ్ గా నిలిచిందంటే.. ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ‘బాహుబలి’ కూడా ‘ముత్తు’ రికార్డ్ ను క్రాస్ చేయలేకపోయింది. ఆర్ఆఆర్ఆర్ మాత్రం జపనీస్ కి విపరీతంగా నచ్చింది. అక్కడ వంద దాటి ద్వి శత దినోత్సవం దిశగా దూసుకెళుతుంది.
ఇదిలా ఉంటే… జపాన్ కి చెందిన ఓ ప్రముఖ మూవీ ప్లస్ సంస్థ ఇండియన్ సినిమా హీరోస్ విషయంలో పోల్ నిర్వహించింది. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని నెంబర్ 1 హీరోగా ఎంచుకున్నారు. ప్రభాస్ రెండో స్థానంలో నిలిచాడు. దీనితో మన టాలీవుడ్ ఇద్దరు స్టార్స్ జపాన్ ఆడియెన్స్ లో అమితమైన ప్రేమతో టాప్ 1, టాప్ 2 స్థానాల్లో నిలవడం విశేషం. దీనితో ఈ అంశం ఫ్యాన్స్ లో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే సంవత్సరం విడుదల కానుంది. ఇక ప్రభాస్ ఆదిపురుష్, సలార్ చిత్రాలు చేస్తున్నారు. ఆదిపురుష్ జూన్ 16న, సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానున్నాయి. వీరిద్దరికి జపాన్ లో విపరీతంగా క్రేజ్ ఉండడంతో అక్కడ కూడా ఈ సినిమాలను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి.. ఈ సినిమాలతో ఎంత వరకు మెప్పిస్తారో.. ఎలాంటి విజయం సాధిస్తారో చూడాలి.