Saturday, January 18, 2025
Homeసినిమారష్మిక తాజా కోరిక

రష్మిక తాజా కోరిక

ఛలో సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఈ సినిమా విజయం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆతర్వాత దేవదాస్, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ.. ఇలా వరుసగా తను నటించిన సినిమాలన్నీ సక్సస్ సాధించడంతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో నటిస్తుంది. ఈ కన్నడ భామ కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అలాగే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇలా కెరీర్ లో దూసుకెళుతున్న రష్మిక టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కూడా మంచి  అనుబంధం ఉంది, ఆ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా రష్మిక హాజరవుతుంది.

విజయ్ అనే కాకుండా.. తెలుగు హీరోల్లో చాలా మంది రష్మికకు మంచి ఫ్రెండ్స్… తన ఫ్రెండ్స్ అయిన తెలుగు హీరోల్లో ఎవరితో అయినా రష్మిక ప్రేమలో పడిందేమో..? ఆమె తెలుగింటి కోడలు అవుతుందేమో… అనుకుంటే.. ఈ అమ్మడు తమిళ ఇంటి కోడలు అవుతానంటుంది. అదే తన కోరిక అంటూ తన మనసులో మాటలను బయటపెట్టింది. ఇంతకీ విషయం ఏంటంటే.. రష్మిక కార్తీ నటించిన సుల్తాన్‌ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిగా నటించింది. ప్రతి ఒక్కరితో శభాష్‌ అనిపించుకుంది.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ… తమిళ సంప్రదాయం, సంస్కృతి చాలా విభిన్నంగా ఉంది. ఇది నన్ను ఎంతగానో ఆకర్షించింది. ముఖ్యంగా ఇక్కడి భోజనం, వంటలు చాలా రుచికరంగా ఉన్నాయి. తమిళ వంటకాలంటే చాలా ఇష్టం. అందుకే.. ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలన్నదే నా కోరిక అని చెప్పింది. మరి.. రష్మిక కోరిక నెరవేరుతుందని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్