Ravi Teja Extraordinary Performance In Khiladi Title Song Out On Deepavali Day :
రవితేజ తాజా చిత్రం ‘ఖిలాడి’ టైటిల్ సాంగ్ ను దీపావళి సందర్భంగా నేడు విడుదల చేశారు. రమేష్ వర్మ దర్శకత్వంలో హవీష్ ప్రొడక్షన్స్ సమర్పణలో… ఎ స్టూడియోస్ ఎల్.ఎల్.పి., పెన్ మూవీస్ సంయుక్తంగా సత్యనారాయణ కోనేరు నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. మీనాక్షీ చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ముగింపు దశలో ఉంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
“హి ఈజ్ ఏ గ్రాండ్ మాస్టర్, హి ఈజ్ ఏ క్రైమ్ పోస్టర్, వీడి ఎదురయ్యే టైమింగ్, డేంజర్ తో డేటింగ్, యు హావ్ టు రన్ ఫాస్టర్… ఖిల్ ఖిల్ ఖిల్ ఖిల్ ఖిలాడీ” అనే లిరిక్స్ తో ఉన్న ఈ సాంగ్ లో రవి తేజ తనదైన మార్క్ నటనతో అలరిస్తున్నారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను సుప్రసిద్ధ గాయకుడు రాం మిరియాల ఆలపించారు. అయితే అయన గాత్రం దేవిశ్రీ ప్రసాద్ గాత్రాన్ని పోలినట్లు అనిపిస్తోంది.
‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్ లైన్ గా వస్తోన్న ఈ సినిమా టైటిల్ సాంగ్ ఆసాంతం పరిశీలించినప్పుడు ‘కిక్’ సినిమాలో పోషించిన పాత్ర తరహాలోనే ఈ సినిమాలో పాత్ర కూడా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇలాంటి పాత్రలు రవితేజ అలవోకగా పోషిస్తారు. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
Must Read :టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ‘ఖిలాడి’