Sunday, January 19, 2025
Homeసినిమారవితేజ చేతుల మీదుగా 'టాప్ గేర్' ట్రైలర్

రవితేజ చేతుల మీదుగా ‘టాప్ గేర్’ ట్రైలర్

ఆది సాయి కుమార్ హీరోగా  కె. శశికాంత్ దర్శకత్వంలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపొందుతోన్న సినమా ‘టాప్ గేర్‘ ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను నిర్మించారు.  డిసెంబర్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. తాజాగా రవితేజ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

2 నిమిషాల 9 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లో ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠ భరితంగా ఉంది. టాప్ గేర్ సినిమాలోని వైవిధ్యాన్ని తెలిపేలా ట్రైలర్ కట్ చేసి సినిమా పై ఆసక్తి రేకెత్తించారు. ‘ఎవర్రా మీరు.. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు?’ అని హీరో ఆది సాయి కుమార్ చెప్పే డైలాగ్ సినిమాలో వైవిధ్యాన్ని బయటపెడుతోంది. ఈ కథ మొత్తం ట్యాక్సీ డ్రైవర్ అయిన ఆది సాయి కుమార్ చుట్టూ తిరుగుతూ ఆడియన్స్‌కి థ్రిల్ ఫీల్ కలిగిస్తుందని టాప్ గేర్ ట్రైలర్ స్పష్టం చేసింది.

ఈ ట్రైలర్ విడుదల చేసిన రవితేజ.. వీడియో చాలా బాగా కట్ చేశారని అన్నారు. చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ… ఈ టాప్ గేర్ సూపర్ సక్సెస్ సాధించడం పక్కా అని అన్నారు. గతంలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి కూడా సినిమాలోని వైవిధ్యాన్ని మెచ్చుకోవడం ఈ టాప్ గేర్ పై బోలెడన్ని అంచనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన రియా సుమన్ హీరోయిన్ గా నటించగా.. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 30వ తేదీన విడుదల కానుంది.

Also Read : 30న ఆది’టాప్ గేర్’ గ్రాండ్ రిలీజ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్