Saturday, November 23, 2024
HomeTrending Newsనడిగడ్డ ప్రజలకు శుభవార్త

నడిగడ్డ ప్రజలకు శుభవార్త

Rds Modernization : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నడిగడ్డ ప్రజలకు శుభవార్త చెప్పారు. ఆర్డీఎస్ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టబోతోందని ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తనకు చెప్పారని తెలిపారు. ఆర్డీఎస్ పనులను 6 నెలల్లో పూర్తి చేసి 87,500 ఎకరాల సాగు నీరందించవచ్చని క్రిష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు నివేదిక ఇచ్చిందన్నారు. ఆర్డీఎస్ విషయంలో 8 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తూ నడిగడ్డను ఎడారిగా మార్చిన సీఎం కేసీఆర్ ను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదంటూ ఏడవటం తప్ప కేసీఆర్ సాధించేమిటని ప్రశ్నించారు.

నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి దాకా 3 లక్షల కోట్ల రూపాయలకుపైగా నిధులు తెలంగాణ  కేటాయించిందన్నారు. ఈ విషయంపై కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటూ సవాల్ విసిరారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 8వ రోజు పాదయాత్ర చేసిన బండి సంజయ్ కుమార్ గద్వాల పట్టణంలోని తేరు మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన ఈ సభకు బండి సంజయ్ తోపాటు బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై, మాజీ మంత్రి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ, మాజీ మంత్రి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి , బిజెపి తమిళనాడు ఇంచార్జ్ పొంగులేటి సుధాకర రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, యాత్ర ప్రముఖ్, బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి , యాత్రా ఉప ప్రముఖ్ వీరేందర్ గౌడ్ , లంకల దీపక్ రెడ్డి, కుమ్మరి శంకర్, జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…..

ఎక్కడికెళ్లినా ప్రజా సంగ్రామ యాత్రకు బ్రహ్మరథం పడుతున్నరు. గద్వాల నియోజకవర్గంలో జరుగుతున్న ఈ బహిరంగ సభ… ఆర్డీఎస్ విజయోత్సవ సభ. 8 ఏళ్లాయే.. ఒక్క చుక్క నీరు రాలేదు.. ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించకుండా కేసీఆర్ చేతగానితనంతో, అసమర్థతో వ్యవహరిస్తున్నడు. ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం దొరికింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. RDS ఆధునీకరణతో అలంపూర్, గద్వాల 87 వేల 500 ఎకరాలకు నీళ్లు వస్తయ్. నేను కేంద్ర జలశక్తి మంత్రి గజేద్ర సింగ్ షెకావత్ కి ఫోన్ చేసి వివరించా… RDS సమస్య గురించి చెప్పినా. ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించమని. ఆర్డీఎస్ పనులను కేంద్రం చేపడుతుందని షెకావత్ చెప్పారు.
మార్చి 9 వ తారీఖునాడు కేఆర్ఎంబీ టీం రిపోర్టు ఇచ్చింది. ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించాలని నిర్ణయం తీసుకుంది.
ఆర్డీఎస్ పనులను 6 నెలల్లో పూర్తి చేసి ఈ నడిగడ్డ ప్రజలకు నీరందించవచ్చని కేఆర్ఎంబీ నివేదిక ఇచ్చింది.

ఆర్డీఎస్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్న డీకే అరుణమ్మను నేటి నుంచి.. ఆర్డీఎస్ అరుణమ్మగా పిలచుకోవాలి.
తుంగభద్రలో తెలంగాణకు రావాల్సిన వాటాను అందించేందుకు ఆర్డీఎస్ మెయిన్ కెనాల్ ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా నీళ్లందించేందుకు ఆర్డీఎస్ ఆనకట్ట, హెడ్ రెగ్యులేటర్ డిజైన్ లో మార్పులు చేస్తోంది. కాలువలోని సీపేజ్, ఓవర్ ఫ్లో సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాన కాలువకు మరమ్మతులు, పునరుద్దరణ పనులు చేపట్టబోతోంది.
తెలంగాణ సరిహద్దు దగ్గర ఆర్డీఎస్ కాలువ నుండి, ఆనకట్ట, హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని కొలిచేందుకు టెలిమెట్రి చర్యలు చేపడుతోంది. ఈ మూడు అంశాలపై చర్యలు చేపట్టడం ద్వారా 87 వేల 500 ఎకరాకు నీళ్లు వచ్చేలా చేస్తోంది.
కేఆర్ఎంబీ వల్లే ఈ మూడు రాష్ట్రాల సమస్యను సులువుగా పరిష్కరించి ఆర్డీఎస్ ద్వారా మనకు రావాల్సిన ప్రతి నీటి చుక్క రాబోతోంది.
గద్వాల్ లో 300 పడకల ఆసుపత్రి కట్టిస్తనని సీఎం చెప్పి మూడేళ్లయింది. అతీగతీ లేదు. రోగమొస్తే పక్క రాష్ట్రం పోయి అక్కడి ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నరు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రి లేదు.. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నరు. కాని కేసీఆర్ సర్కారుకు చలనం లేకుండా పోయింది.

Also Read : పైసలిస్తే ఓట్లేస్తారనే అహంకారం కేసీఆర్ ది – బిజెపి 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్