Reservation: అగ్నివీరులకు కోస్ట్ గార్డ్, రక్షణ శాఖ సాధారణ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అగ్నిపథ్ మొదటి బ్యాచ్ కు వయోపరిమితిని ఐదేళ్లకు పెంచాలని కూడా నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం, పలుచోట్ల ఈ అందోళనలు హింసాత్మకంగా మారడంతో భారతరక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో పాటు రక్షణ శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం జరిపి సమీక్ష నిర్వహించారు.
దేశ వ్యాప్త నిరనసనలతో సిఆర్పీఎఫ్ ఉద్యోగాల్లో , అస్సాం రైఫిల్స్ లో అగ్ని వీర్ లకు 10 శాతం రిజర్వేషనలు కల్పించాలని కేంద్ర హోం శాఖ నిన్ననే నిర్ణయం తీసుకుంది. నేడు రక్షణ శాఖ కూడా కీలక రిజర్వేషన్ పై కీలక నిర్ణయం వెలువరించింది. నేడు తీసుకున్న పది శాతం మాజీ సైనికులకు ఇచ్చే రిజర్వేషన్ శాతానికి అదనంగా ఉంటుందని ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read :