Saturday, July 27, 2024
HomeTrending Newsగ్రామాల్లో చూడండి : లోకేష్ కు ధర్మాన హితవు

గ్రామాల్లో చూడండి : లోకేష్ కు ధర్మాన హితవు

తమ ప్రభుత్వం గ్రామాల్లో చేసిన అభివృద్ధి చూసి మాట్లాడాల‌ని  రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ప్రతిపక్ష నాయ‌కుల‌కు హిత‌వు ప‌లికారు. క‌ళ్లున్నా చూడ‌లేని వాళ్ళని, చెవులుండి వినలేని వాళ్ళని, నిద్ర న‌టించే వాళ్ల‌ను ఏమి అనగలమని ఆయన ప్రశ్నించారు.  శ్రీ పురం (సానివాడ) పంచాయతీలో రూ. 80 లక్షల వ్యయంతో కొత్త‌గా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ ను మంత్రి ధర్మాన ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ విప‌క్ష నేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో (పక్క రాష్ట్రంలో) ఉంటున్నారని, ఆయన వ్యాపారాలన్నీ పక్క రాష్ట్రంలో ఉంటే ఇక్క‌డ సీఎం ప‌ద‌వి కావాల‌ని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని నారా లోకేశ్ చెబుతున్నారని, అసలు ప‌థ‌కాల అమలులో ఏనాడూ వర్గాలు చూడలేదని, అర్హులా? కాదా? అన్న‌దే చూశామని స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఎందుకు ఈ మాట చెప్పలేకపోయారు. చెప్పు లోకేశ్? అని నిలదీశారు.

టీడీపీ హ‌యాంలో జన్మభూమి కార్య‌క‌ర్త‌లు దోచుకున్నారని, ప‌థ‌కాల వ‌ర్తింపు కోసం ప్ర‌జ‌లు అర్జీలు పెట్టుకుంటే కలెక్టర్లు సైతం జన్మ భూమి కమిటీ సభ్యులను కలవమని చెప్పేవాళ్ళని గుర్తు చేశారు. ఇప్పుడు గ్రామాలకు వచ్చి చూస్తే వాస్త‌వాలేంట‌న్న‌దని లోకేష్ కు తెలుస్తుందన్నారు.  విద్యా వ్య‌వ‌స్థ నాశనం అయిపోయిందని అంటున్నారని కానీ తాము ఎన్నో మార్పులు… ఇంట‌ర్నేష‌న‌ల్ సిల‌బ‌స్ తీసుకు వచ్చి పాఠాలు చెప్పిస్తున్నామని, కానీ వాస్త‌వాలు గుర్తించ‌కుండా ఆ చంద్ర‌బాబు,లోకేశ్  అబ‌ద్ధాలు, అన్యాయాలతో ప్ర‌జ‌ల ముందుకు వెళ్తున్నారని ధర్మాన అసహనం వ్యక్తం చేశారు.

“కొంత‌మంది సినీ యాక్ట‌ర్లు వ‌స్తుంటారు. వాళ్లంతా అప్పుడ‌ప్పుడూ క‌నిపిస్తూ ఉంటారు. వాళ్లే వ‌లంటీర్లు వద్దు అని అంటున్నారు. వ‌లంటీర్లు ప్రజలకు చేస్తున్న సేవ ఏంట‌న్న‌ది ప‌క్క రాష్ట్రంలో ఉన్నవారికి ఏం అర్థం అవుతుంది ? ఈ రోజు ఇంతమంది సంతోషంగా ఉంటున్నారు అంటే దానికి కారణం జగన్ ప్రభుత్వం కాదా..అంద‌రి క్షేమం కోరుకున్నది,అందుకు త‌గ్గ విధంగా పాల‌న చేస్తున్న ది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా.. టీవీల‌లో,పత్రికల్లో ఈ ప్రభుత్వం పై కొంద‌రు చేస్తున్న అసత్య ప్రచారాలను అందరూ తిప్పి కొట్టాలి. మాట్లాడితే చాలు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డ‌బ్బులు పంచేస్తున్నారు.. పంచేస్తున్నారు..అంటున్నారే కానీ ఆయ‌న‌ను ఉద్దేశించి..తినేస్తున్నారు..తినేస్తున్నారు అని అన‌డం లేదు ఎందుకు..?” అని ధర్మాన అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్