టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్విట్జర్లాండ్ కు చెందిన ఈ ఆటగాడు తనకెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను 2003లో (వింబుల్డన్) గెల్చుకున్నాడు. 2018లో చివరి టైటిల్ (ఆస్ట్రేలియన్ ఓపెన్) గెల్చుకున్నాడు. 1998లో అంతర్జాతీయ టెన్నిస్ ప్రొఫెషనల్ కెరీర్ లో అడుగుపెట్టిన ఈ స్టార్ ప్లేయర్ మొత్తం 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెల్చుకున్నాడు. వీటిలో 8 వింబుల్డన్, 6 ఆస్ట్రేలియన్ ఓపెన్, 5 యూఎస్ ఓపెన్, ఒక ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెల్చుకున్నాడు. మొత్తం ఆరుసార్లు ఏటీపీ టూర్ ఫైనల్స్ గెల్చుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకం గెల్చుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ లో సింగిల్స్ విభాంలో రజత పతకం సంపాదించాడు.
2004లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకింగ్ ను సాధించాడు ఫెదరర్. 2021లో వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాడు.