Precautions: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రముఖ రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు. అదనపు బలగాలను మొహరించారు. విజయవాడ స్టేషన్ వద్ద పోలీసులు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగంతో కలిసి రైల్వే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
విజయవాడతో పాటు విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు తో పాటు అన్ని ముఖ్య స్టేషన్లలో ముందు జాగ్రత్త చర్యగా బలగాలను రంగంలోకి దించారు.
Also Read : సికింద్రాబాద్ లో చేయి దాటిన పరిస్థితి