Saturday, January 18, 2025
Homeసినిమాజపాన్ లో 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్ ఎంత?

జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ ఎంత?

ఆర్ఆర్ఆర్.. బాలీవుడ్ నే కాదు.. హాలీవుడ్ ని సైతం షేక్ చేసిన మూవీ. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కించిన మూవీ కావడంతో భారీ అంచనాలతో రిలీజైంది. అంచనాలకు తగ్గట్టుగానే ఆర్ఆర్ఆర్ సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ 1100 కోట్లకు పైగా కలెక్షన్ కొల్లగొట్టింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అత్యద్భుత నటన కనబరిచారు. రాజమౌళి మరొక్కసారి తన అద్వితీయమైన దర్శకత్వ ప్రతిభతో ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్ మూవీని ఇటీవల జపాన్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేసింది యూనిట్. అంతే కాకుండా ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి జపాన్ లో ఆర్ఆర్ఆర్ ను విస్తృతంగా ప్రచారం చేశారు. దీనికి అక్కడ మంచి స్పందన వచ్చింది. దీనితో జపాన్ లో ఆర్ఆర్ఆర్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది. అక్కడ కూడా సూపర్ గా క్రేజ్, కలెక్షన్స్ అందుకోవడంతో పాటు ఇప్పటి వరకు మొత్తంగా 17 రోజులకు గాను 185 మిలియన్ జపనీస్ యన్ లు సాధించింది. అంటే.. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 10.34 కోట్లు అన్నమాట.

ఇక ఈ మూవీ జపాన్ లో 122కె ఫుట్ ఫాల్స్ ని సొంతం చేసుకుంది. కాగా జపాన్ లో ఇప్పటి వరకు విడుదలై భారీ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ముత్తు ఫస్ట్ ప్లేస్ లో నిలవగా, బాహుబలి 2 సెకండ్ ప్లేస్ ని దక్కించుకుంది. ఇక ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ ముచ్చటగా మూడవ ప్లేస్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఈ మూవీ జపాన్ లేటెస్ట్ కలెక్షన్స్ ఆర్ఆర్ఆర్ మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. స్పెషల్ పోస్టర్ ని ఆర్ఆర్ఆర్ టీమ్ విడుదల చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి.. జపాన్ లో ఆర్ఆర్ఆర్ ఇంకెంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్