Sunday, January 19, 2025
Homeసినిమా'ఆర్ఆర్ఆర్' కి ఆస్కార్ వచ్చే ఛాన్స్ ఉందా..?

‘ఆర్ఆర్ఆర్’ కి ఆస్కార్ వచ్చే ఛాన్స్ ఉందా..?

ఎన్టీఆర్, రామ్ చరణ్‌, రాజమౌళిల కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ‘ఆర్ఆర్ఆర్‘. ఈ భారీ పాన్ ఇండియా మూవీ 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే.. ఎవరూ ఊహించని విధంగా ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ అంటూ వార్తలు రావడంతో ఇది నిజమా..?  లేక గ్యాసిప్పా..?  ఆర్ఆర్ఆర్ మూవీ ఏంటి..? ఆస్కార్ బరిలో నిలవడం ఏంటి..? అనుకున్నారు. హాలీవుడ్ మ్యాగజైన్స్ సైతం ఆస్కార్ బరిలో అంటూ వార్తలు రాయడంతో ఆస్కార్ కోసం పోటీ పడడం వాస్తవమే అని తెలిసింది.

అయితే.. ఇండియా తరుపున ఆర్ఆర్ఆర్ మూవీని పంపించకపోయినప్పటికీ… ఆస్కార్ బరిలో నిలవడం విశేషం. ఇంతకీ ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే. ప్రస్తుతం హాలీవుడ్ లో ఉన్న ట్రెండ్ అలా ఉంది. తాజాగా లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రిక ఆస్కార్ ఓట్లు వేసే వారి మూడ్ ఎలా ఉందో తెలిపే లిస్ట్ వేసింది. బెస్ట్ ఫిలిం కేటగిరిలో ఆర్ఆర్ఆర్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో రాజమౌళి పేర్లు కొనసాగుతున్నట్లు తెలిపింది. అంటే వోట్ వేసే సభ్యులు ఈ సినిమాని నామినేషన్ కోసం సీరియస్ గానే కన్సిడర్ చేస్తున్నారు.

మరింత బజ్ క్రియేట్ చెయ్యడానికి..  ఇంకా రెండు నెలల సమయం ఉంది. మన దేశంలో ఇప్పటి వరకు ఎందరో గొప్ప ఫిల్మ్ మేకర్స్, గొప్ప సినిమాలు తీసిన వాళ్ళు ఆస్కార్ కి ప్రయత్నించినప్పటికీ అప్పుడు వారికి అదృష్టం కలసి రాలేదు. అయితే.. రాజమౌళి క్రేజ్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ లో ఉంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా అమెరికన్ ఫిల్మ్ మేకర్స్ కి బాగా నచ్చింది. పైగా గత సినిమాలకు, ఈ సినిమాకి తేడా ఏంటంటే ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళు దాదాపుగా అందరూ ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చూసేశారు. ఆర్ఆర్ఆర్ గురించి హాలీవుడ్ మేకర్స్ కి బాగా తెలిసింది. మరి.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకుంటుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్