Tuesday, October 1, 2024
Homeసినిమాజపాన్ లో దూసుకెళుతున్న ఆర్ఆర్ఆర్

జపాన్ లో దూసుకెళుతున్న ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్.. బాహుబలి తర్వాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా.ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రికార్డు కలెక్షన్స్ సాధించింది. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ఈ సినిమాతో 1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి చరిత్ర సృష్టించారు. ఇక ఓటీటీలో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్ లో సైతం ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఆస్కార్ కోసం పోటీపడుతుండడం విశేషం.

ఇదిలా ఉంటే.. ఈ మూవీని ఇటీవల జపాన్ లో రిలీజ్ చేశారు. ఎన్టీఆర్, చరణ్‌, రాజమౌళి అక్కడ విస్త్రతంగా ప్రచారం చేశారు. దీంతో జపాన్ లో ఆర్ఆర్ఆర్ ఎంత కలెక్ట్ చేస్తుంది.? అక్కడ రజనీకాంత్ ‘ముత్తు’ సినిమా సాధించిన రికార్డ్ ను క్రాస్ చేస్తుందా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. అంచనాలకు తగ్గట్టుగానే జపాన్ లో ఈ మూవీకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 21వ రోజు వసూళ్లు 1వ రోజు కంటే ఎక్కువగా ఉన్నాయి. జపాన్ లో సినిమాకు వస్తున్న స్పందన పట్ల మేకర్స్ చాలా సంతోషంగా ఉన్నారు.

ఈ చిత్రం మొత్తం 206 మిలియన్ యెన్ అంటే.. దాదాపు రూ. 11 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు జపాన్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘ముత్తు’. ఆతర్వాత బాహుబలి నిలిచింది. తర్వాత ప్లేస్ లో ఆర్ఆర్ఆర్ నిలిచింది. కలెక్షన్స్ చూస్తుంటే.. బాహుబలి, ముత్తు చిత్రాల కలెక్షన్స్ ను క్రాస్ చేసి నెంబర్ 1 ప్లేస్ లో నిలవడం ఖాయం అనిపిస్తుంది. జపాన్ తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీని చైనాలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్.. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం రికార్డ్ కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టిస్తుంది.

Also Read : చరణ్‌ నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్.? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్