Monday, February 24, 2025
Homeస్పోర్ట్స్దేశ ప్రజలకు సచిన్ శుభాకాంక్షలు

దేశ ప్రజలకు సచిన్ శుభాకాంక్షలు

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్వతంత్ర అమృతోత్సవాల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.  హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈనెల 13న  తన ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించిన సచిన ఆ ఫోటోను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ  అభినందనలు తెలిపాడు.

మన దేశానికి స్వాతంత్రం లభించి 75 ఏళ్ళు నిండాయి. ఈ వేడుకలను దేశ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ నెల 13నుంచి15 వరకూ మూడు రోజులపాటు దేశంలోని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపు ఇచ్చారు.  పలువురు క్రీడాకారులు కూడా ఈ పిలుపు అందుకొని  తమ ఇళ్ళపై జెండా ఎగురవేశారు.

Also Read : ప్రజాస్వామ్య దేశాలకు భారత్‌ మార్గదర్శి – ప్రధాని మోడీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్