ఎల్లాలు బాబు టంగుటూరి సమర్పణలో శ్రీ భవ్ నీష్ ప్రొడక్షన్స్ పతాకంపై సీనియర్ నటుడు సాయి కుమార్, సాయి శ్రీనివాస్, ఐశ్వర్య, విజయ్ చందర్, రాజీవ్ కనకాల నటీనటులుగా శాంతి కుమార్ తుర్లపాటి దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. విజయదశమి సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, సీనియర్ నటుడు విజయ చందర్, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో ఆది సాయికుమార్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ పూజ కార్యక్రమాన్ని విజయ్ చందర్ జ్యోతి ప్రజ్వలన చేయగా, ఫ్యాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు స్క్రిప్ట్ ను అందించారు. హీరో. హీరోయిన్ల పై జరిగిన తొలి ముహూర్తపు సన్నివేశానికి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ నిచ్చారు. లవ్లీ హీరో ఆది సాయి కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు.
శాంతికుమార్ మాట్లాడుతూ “మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన నేను చిన్న కళాకారుడు స్థాయి నుంచి ఈరోజు డైరెక్టర్ స్థాయికి వచ్చాను అంటే దానికి కారణం నా గాడ్ ఫాదర్ మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి గారు. శాంతికుమార్ అనే వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి నేను ఋణపడి ఉన్నాను వారికి నా ధన్యవాదాలు.
నేను చిన్నప్పటినుంచి రైటర్ ని. కరోనా వలన అందరూ లాక్డౌన్ ఉన్న టైంలో 8 నెలలు ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసి, డైలాగ్స్ తో సహా రాసుకున్నాను. మంచి నటీనటులు, సాంకేతిక వర్గంతో విజయదశమి రోజు మొదలు పెట్టిన మా సినిమా మంచి విజయం సాధించాలని, దర్శకుడిగా ఇలాగే మంచి అవకాశాలు రావాలని దేవున్ని, పెద్దలను మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అన్నారు.