Monday, January 20, 2025
HomeTrending Newsఆ లైన్ లోనే సిబిఐ విచారణ : సజ్జల అనుమానం

ఆ లైన్ లోనే సిబిఐ విచారణ : సజ్జల అనుమానం

వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ పేరుతో డ్రామా జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. బాబు హయంలో, సిఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దీనిపై విచారణ జరిపిందని, ఈ లీడ్ తీసుకుని విచారించకుండా ఓ సరికొత్త పంధాలో సిబిఐ విచారణ మొదలు పెట్టిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ కోరుకున్న లైన్ లోనే విచారణ జరుగుతుందన్న అనుమానాన్ని సజ్జల వ్యక్తం చేశారు. గూగుల్ టేకౌట్ అనేది కొత్తగా వింటున్నామన్నారు. మోకాలుకు-బట్టతలకు ముడేస్తున్నారని అన్నారు. పులివెందులలో వైఎస్ వివేకా- భాస్కర్ రెడ్డి ల ఇళ్లు దగ్గరలోనే ఉంటాయని వివరించారు.

అవినాష్ రెడ్డికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని,  సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలూ కూడా లేవని, వివేకా రెండో పెళ్లి విషయంలో సిబిఐ ఎందుకు దృష్టి సారించలేదని సజ్జల ప్రశ్నించారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని, కొంతమందిని లక్ష్యంగా తీసుకొని విచారణ సాగుతోందన్నారు.  హత్య జరిగినప్పుడు టిడిపి అధికారంలో ఉందని, బిటెక్ రవి, అదినారాయణ రెడ్డి లను ఎందుకు విచారించలేదని నిలదీశారు. వివేకాను కోల్పోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వ్యక్తిగతంగా జగన్ కు నష్టమని చెప్పారు.  చంద్రబాబు-బిటెక్ రవి-ఆదినారాయణ ఫోన్ రికార్డులను పరిశీలించాలని అన్నారు.  జగన్ పార్టీ పెట్టినపుడు కాంగ్రెస్ లోనే ఉన్న వివేకా ఆ తర్వాత పార్టీలో చేరారని, ఒక తండ్రిగా జగన్ ను గైడ్ చేశారని, ఎమ్మెల్సీగా వివేకాను బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించారని వివరించారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్