Thursday, March 28, 2024
HomeTrending Newsఆ అవసరం మాకు లేదు: సజ్జల

ఆ అవసరం మాకు లేదు: సజ్జల

Sajjala Fire On Chandrababu Comments In Connection With Kuppam Municipal Election :

కుప్పం ఎన్నికల్లో అక్రమాలు చేయాల్సిన అవసరం తమపార్టీకి లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. కుప్పం కోటను తాము ఎపుడో బద్దలుకొట్టామని, స్థానిక ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించామని తెలిపారు. కుప్పంలో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని బాబు చేసిన విమర్శలపై సజ్జల స్పందించారు. టిడిపి నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతూ, ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ కొన్ని వీడియో లను సజ్జల మీడియా ఎదుట ప్రదర్శించారు. సిఎం జగన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రమంతటా విస్తరించాయని, ప్రజలు జగన్ నాయకత్వానికి ప్రతి ఎన్నికల్లో మద్దతు తెలుపుతూ వస్తున్నారని, కుప్పంలో కూడా ప్రజలు తమ పార్టీని గెలిపిస్తారని అయన ధీమా వ్యక్తం చేశారు.

కుప్పంలో దొంగ ఓట్లకు ఏమాత్రం అవకాశం లేదని, మున్సిపాలిటీలో 24వార్డులు ఉన్నాయని, 34  వేలమంది ప్రజలు ఉన్న ఈ నగర పంచాయతీలో ఒక్కో వార్డుకు రెండు పోలింగ్ బూత్ లు ఉన్నాయని, ఇలాంటి చోట అసలు దొంగ ఓట్లు వేయడం ఎలా సాధ్యమవుతుందని సజ్జల ఎదురు ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేస్తుంటే స్థానిక ప్రజలు పట్టుకోలేరా అని నిలదీశారు. తమపై చంద్రబాబు చేసిన విమర్శలు అర్ధరహితమని, టిడిపి ఏజెంట్లను అరెస్టు చేశారని బాబు చెప్పారని… రౌడీ షీట్లు ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, రౌడీ షీటర్లను ఏజెంట్లుగా కూర్చోబెట్టడం తప్పని బాబుకు తెలియదా అని అడిగారు. మధ్యాహ్నం ఒంటిగంటకు దాదాపు 60 శాతం పోలింగ్ అయ్యిందంటే ప్రజలు ఎంత పట్టుదలగా ఓట్లు వేస్తున్నారో అర్ధమవుతుందని తుసజ్జల చెప్పారు.

కుప్పం మున్సిపాలిటీలో టిడిపి ఓటమి ఖాయమని, ఇప్పటికే ఆ పార్టీ కాడి కింద పారేసిందని అందుకే బాబు ఓటమికి  సాకులు వెతుక్కుంటున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. ఒక వేళ గెలిస్తే ఇంత కష్టపడి గెలిచామని చెప్పుకోవడానికే ఈ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అధికారులపై వ్యాఖ్యలు చేయడం బాబుకు అలవాటేనని, అధికారంలో ఉన్నప్పుడు కూడా వారితో అలాగే వ్యవహరించేవారని సజ్జల విమర్శించారు.

Also Read :  కుప్పంలో వైసీపీ జెండా : సజ్జల

RELATED ARTICLES

Most Popular

న్యూస్