Saturday, November 23, 2024
HomeTrending Newsఇదే రియాక్షన్ ఉంటుంది: సజ్జల హెచ్చరిక

ఇదే రియాక్షన్ ఉంటుంది: సజ్జల హెచ్చరిక

సిఎం జగన్ పై టిడిపి నేత పట్టాభి నిన్న చేసిన వ్యాఖ్యలు ప్రత్యక్షంగా చంద్రబాబు చేయించినవేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నిన్న జరిగిన సంఘటనలకు చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక కర్త, కర్మ. క్రియ ఆయనేనని  స్పష్టం చేశారు. ఇంతటి నీచమైన పదం ఉపయోగించిన తరువాత కూడా స్పందించనివారు మనిషే కాదన్నారు.  ఈ స్థాయిలో బూతులు తిడితే రియాక్షన్ రాకుండా ఎందుకుంటుందని ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.

పట్టాభి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించాల్సిందని, ఇలా మాట్లాడడం తప్పు అని అయన ఒక మాట అని ఉంటే గౌరవం ఉండేదని,  పార్టీ కార్యాలయం దేవాలయం అని చంద్రబాబు అన్నారని, దేవాలయంలో బూతులు మాట్లాడతారా అని సజ్జల నిలదీశారు. ఇలాంటి భాష ఉపయోగిస్తే భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. దేనికైనా ఓ హద్దు ఉంటుందని, నిన్నటితో మొత్తం దాటారని,  ఇకపై ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఆరు నెలలుగా టిడిపి నేతలు, ముఖ్యంగా యువ నేత లోకేష్ నిరాశా నిస్పృహలో అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్నా, తాము సంయమనం పాటిస్తున్నామని…. సిఎం జగన్ అయితే వీటిని పట్టించుకోవడం లేదని, దీన్ని తమ చేతగానితనంగా భావించి, నిన్న అభ్యంతరకరమైన, అసహ్యమైన పదప్రయోగంతో పట్టాభి  వ్యాఖ్యలు చేశారని సజ్జల విమర్శించారు.  ఇవి నోరు జారి చేసిన వ్యాఖ్యలు కావని, అందులోనూ టిడిపి ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మట్లాడుతూ ఈ భాష ఉపయోగించడం ముందస్తు ప్రణాళికాలో భాగమేనన్నారు. ఈ పదం పదే పదే అనడం వెనుక ఉద్దేశ్యమేమిటని ప్రశ్నించారు.

ఇటీవల అయ్యన్నపాత్రుడు కూడా ఇలాంటి వెకిలి భాషనే ఉపయోగించారని సజ్జల గుర్తు చేశారు. టిడిపి నేతలు పరుష పదజాలం ఉపయోగిస్తున్నా తాము పట్టించుకోలేదని, లేకపోతే అయ్యన్న చెత్త నాకొడుకులు అన్నప్పుడే చెత్తలో వేసి తొక్కి ఉండేవాళ్లమని వ్యాఖ్యానించారు.  నిన్నటి ఘటనపై టిడిపియేతర విపక్షాలు స్పందించిన తీరుకూడా దారుణమని, ఇలాంటి పదజాలం వాడొద్దని టిడిపికి సలహా ఇవ్వాల్సిందిపోయి తమను తప్పుబట్టడం సరికాదన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్