Sunday, January 26, 2025
Homeసినిమాసలార్ లేటెస్ట్ అప్ డేట్ ఏంటి..?

సలార్ లేటెస్ట్ అప్ డేట్ ఏంటి..?

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘సలార్‘. శృతిహాసన్ నటిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ డిఫరెంట్ గా ఉండడం.. ప్రభాస్ క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో చూపించడంతో సలార్ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ రెండు పార్టులుగా రానుందని.. ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని వార్తలు రావడంతో ఎప్పుడెప్పుడు సలార్ అప్ డేట్ వస్తుందా అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండడం వలన సలార్ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది. అయితే.. ఈ కొత్త సంవత్సరంలో సలార్ కొత్త షెడ్యూల్ ను ఈ నెల 8వ తారీఖు నుండి మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వారంలో ప్రారంభం కాబోతున్న షెడ్యూల్ లో క్లైమాక్స్ కు సంబంధించిన కీలక సన్నివేశాలు భారీ ఎత్తున చిత్రీకరించేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని సమాచారం. హంబుల్ ఫిల్మ్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

జనవరిలో రావాల్సిన ‘ఆదిపురుష్‌’ మూవీ జూన్ కు వాయిదా పడింది. అయితే.. సలార్ మూవీని సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ రెండు సినిమాల రిలీజ్ కు మధ్య గ్యాప్ తక్కువ ఉండడంతో సలార్ సెప్టెంబర్ లో రిలీజ్ కాకపోవచ్చు అనే వార్తలు వచ్చాయి. అయితే.. ఆదిపురుష్ మూవీ జూన్ లో కూడా రావడం లేదని.. వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో సలార్ సెప్టెంబర్ లో రావడం ఖాయం అంటున్నారు సినీజనాలు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్