Saturday, January 18, 2025
Homeసినిమాసమంత ఖాతలో మరో హిట్ పడిపోయినట్టే!

సమంత ఖాతలో మరో హిట్ పడిపోయినట్టే!

(Movie Review): సమంత ఇంతకుముందు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కొన్ని చేసింది ఆ సినిమాలు నటన పరంగా ఆమెను మరికొన్ని మెట్లు ఎక్కించాయి కూడా. అలా తాజాగా ఆమె చేసిన నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమానే ‘యశోద’. టీజర్ .. ట్రైలర్ చూసినప్పుడు ఈ కథ సరోగసి చుట్టూనే తిరుగుతుందని అంతా అనుకున్నారు. సరోగసి అనేది పెద్ద బిజినెస్ గా మారిపోయింది .  ఆ బిజినెస్ చుట్టూ ఈ కథ నడుస్తుందని కూడా అనుకున్నారు. తెరపై ఈ కథ మొదలైన కొంతసేపటి వరకూ థియేటర్లో ఉన్న ఆడియన్స్ కి కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఆ తరువాతనే కథ అనూహ్యమైన మలుపు తిరుగుతుంది.

ఒక మురికివాడకి చెందిన ‘యశోద‘ తన చెల్లెలు ఆపరేషన్ కి అవసరమైన డబ్బు కోసం సరోగసీకి ఒప్పుకుంటుంది. ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ సంరక్షణ పేరుతో యశోదను ఒక సెంటర్ కి చేరుస్తారు. అక్కడ యశోద వంటివారు చాలామంది ఉంటారు. ఆ సెంటర్ అంతా కూడా మధుబాల (వరలక్ష్మి శరత్ కుమార్) కనుసన్నల్లో నడుస్తూ ఉంటుంది. నొప్పులతో ఆపరేషన్ రూమ్ కి వెళ్లినవారెవరూ తిరిగిరారు. దాంతో అక్కడ సరోగసి పేరుతో ఏదో రహస్య వ్యవహారం నడుస్తుందనే అనుమానం రావడంతో, యశోద అదేమిటో తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది.

ఇదే నేపథ్యంలో హైద్దరాబాద్ కి వచ్చిన ఒక హాలీవుడ్ హీరోయిన్ .. శ్రీమంతుడైన శివారెడ్డితో ప్రేమలో ఉన్న ఆరుషి అనుమానాస్పద స్థితిలో చనిపోతారు. అందుకు సంబంధించిన పోలీస్ విచారణ వాసుదేవ్ (సంపత్ రాజ్) అధ్వర్యంలో కొనసాగుతూ ఉంటుంది. ఈ రెండు ట్రాకులు వేరు వేరుగా నడుస్తూ ప్రీ క్లైమాక్స్ కలిసి ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. ఇంటర్వెల్ కి ముందు ట్విస్ట్ .. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆ తరువాత కథపై ఒక్కసారిగా ఆసక్తిని పెంచేస్తాయి. ఇక అప్పటి నుంచి కథ మరింత చిక్కబడుతూ .. అనూహ్యమైన ట్విస్టులతో కట్టిపడేస్తుంది.

దర్శకులుగా హరి – హరీశ్ ప్రతిభకు అద్దం పట్టే సినిమా ఇది.  కథాకథనాల పరంగా .. చిత్రీకరణ పరంగా ఈ సినిమాపై ఎప్పటికప్పుడు  ఉత్కంఠను పెంచుతూ వెళ్లారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది.ఇక ఫొటోగ్రఫీ ఈ సినిమాకి అదనపు బలాన్ని ఇచ్చిందని చెప్పచ్చు. సమంత పాత్రను డిజైన్ చేసిన తీరు .. ఆమె నటన ఈ కథను ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో ప్రధానమైన పాత్రను పోషించాయనడంలో సందేహం లేదు. ద్వాపర యుగంలో కృష్ణుడు రక్షించబడటం కోసం యశోద దగ్గరికి చేర్చబడతాడు. తల్లి గర్భంలో ఎదుగుతున్న అలాంటి కృష్ణులను ఎంతోమందిని ఈ కథలో ఈ యశోద కాపాడుతుంది. అలా ఈ సినిమాకి ఈ టైటిల్ కూడా కరెక్టుగా సరిపోయింది.

Also Read :    ‘యశోద’లో యాక్షన్ రియలిస్టిక్‌గా ఉంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్