Saturday, January 18, 2025
Homeసినిమాజీ 5 వేదికపైకి 'ఊరు పేరు భైరవకోన'

జీ 5 వేదికపైకి ‘ఊరు పేరు భైరవకోన’

సందీప్ కిషన్ – వీఐ ఆనంద్ కాంబినేషన్లో ‘ఊరుపేరు భైరవకోన’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 16వ తేదీన థియేటర్లను పలకరించింది. ఫాంటసీ టచ్ తో హారర్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమా, ఆడియన్స్ ను చాలా వరకూ థియేటర్స్ కి రప్పించగలిగింది. అలాంటి ఈ సినిమా త్వరలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి రావడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ 5 వారు దక్కించుకున్నట్టుగా సమాచారం.

ఫాంటసీ టచ్ తో కూడిన కథలను ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించడంలో వీఐ ఆనంద్ కి మంచి పేరు ఉంది. గతంలో ఈ తరహా కాన్సెప్ట్ తో ఆయన తెరకెక్కించిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై చాలామంది ఆసక్తిని చూపుతూ వచ్చారు. హారర్ … ఫాంటసీతో  కూడిన ఈ కథను, దర్శకుడు ఇటు చరిత్ర .. అటు పురాణాలతోను ముడిపెడుతూ ఆడియన్స్ లో ఉత్కంఠను రేకెత్తిస్తూ వెళ్లాడు.

అలాంటి ఈ సినిమా త్వరలోనే జీ 5 ద్వారా అందుబాటులోకి రానుందనే టాక్ వినిపిస్తోంది. హీరో తాను ప్రేమించిన యువతి కోసం .. ఆమె ఆశయాన్ని నెరవేర్చడం కోసం .. దెయ్యాల ఊరులోకి అడుగు పెడతాడు. అక్కడి నుంచి అతను ఎలా బయటపడతాడు? అనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం. సందీప్ కిషన్ జోడీగా వర్ష బొల్లమ్మ – కావ్య థాపర్ కనిపిస్తారు. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ఒక పాట చాలా పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్