Saturday, January 18, 2025
Homeసినిమాసంతోష్ శోభన్ కి 'ప్రేమ్ కుమార్' హెల్ప్ ఇప్పుడు చాలా అవసరం!  

సంతోష్ శోభన్ కి ‘ప్రేమ్ కుమార్’ హెల్ప్ ఇప్పుడు చాలా అవసరం!  

సంతోష్ శోభన్ యంగ్ హీరోలతో కలిసి పరిగెడుతూనే ఉన్నాడు. ఆడియన్స్ తో ఎంత మాత్రం గ్యాప్ రాకుండా ఒక సినిమా తరువాత ఒకటిగా చేసుకుంటూ వెళుతున్నాడు. కామెడీ .. యాక్షన్ .. ఫైట్లు .. డాన్సులు బాగానే చేస్తున్నాడు. యంగ్ హీరోల రేసులో ముందుకు వెళ్లడానికి చాలానే కష్టపడుతున్నాడు. అదృష్టం కొద్దీ మంచి బ్యానర్ల నుంచే అవకాశాలు కూడా వస్తున్నాయి. చేసిన సినిమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా థియేటర్లకు వస్తున్నాయి.

నటన పరంగా కుర్రాడికి వంక బెట్టవలసిన అవసరం లేదు. ఈ జనరేషన్ కుర్రాళ్లు ఆశించే అవుట్ ను అందించే హీరోనే. అయితే కొంతకాలంగా హిట్ అనేది ఆయన దరిదాపుల్లోకి రాకుండా తప్పించుకుంటోంది. అయినా దానిని ఎలాగైనా వెతికి పట్టుకోవడానికి మనవాడు ట్రై చేస్తున్నాడు. అయినా అది ఆయనతో దాగుడు మూతలు ఆడుతోంది. ఆయన నుంచి వరుసగా వచ్చిన ఓ నాలుగు సినిమాలు అసలు ఎంతమాత్రం యూత్ ను ఆకట్టుకోలేకపోయాయి. అందువల్లనే ఈ సారి హిట్టు విషయంలో పట్టుదలతోనే ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే ఆయన నుంచి రావడానికి ‘ప్రేమ్ కుమార్’ సినిమా రెడీ అవుతోంది. ఆగస్టు 18వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. పెళ్లి విషయంలో ఆటంకాలను ఎదుర్కునే ఒక యువకుడిగా ఈ సినిమాలో ఆయన కనిపించనున్నాడు. కథ ఏదైనా కామెడీనే ప్రధానంగా సాగుతుంది. అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించిన ఈ సినిమా, సంతోష్ కి హిట్ తెచ్చిపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఆయన కెరియర్ గ్రాఫ్ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశాలు లేకపోలేదు. ‘ప్రేమ్ కుమార్’ ఏం చేస్తాడో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్