Wednesday, April 24, 2024
HomeTrending Newsభారత్ లో ఇంటర్‌నెట్‌ సేవల్లోకి టెస్లా

భారత్ లో ఇంటర్‌నెట్‌ సేవల్లోకి టెస్లా

ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్‌నెట్‌ సేవలపై దృష్టి పెట్టారు. తమ స్టార్‌ లింక్‌ సేవల అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని గురువారం ఆయన ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. దేశంలో ఈ సేవలు అందుబాటులోకి వస్తే సెల్‌ఫోన్‌ టవర్లు, కేబుళ్లతో పాటు శాటిలైట్‌ ఇంటర్‌నెట్‌ సేవలు లభించనున్నాయి. ఒక చిన్న యాంటెన్నాతో ఇంటర్‌నెట్‌ను పొందడానికి వీలుంది.

మరో వైపు స్టార్ లింక్ బ్రాడ్ బ్యాండ్ ఈ నెల నుంచి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తోంది. స్టార్ లింక్ బీటా సర్వీసెస్ అమెరికా, ఆస్ట్రేలియా తో సహా 11 దేశాల్లో ఇప్పటికే సేవలు అందిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్