రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి 8వ తరగతి లోపు చదువుతున్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాన్ని రద్దు చేయనున్నట్లు కేంద్రం చేసిన ప్రకటనను వెంటనే విరమించుకోవాలని బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న స్కాలర్ షిప్ వారికి ఎంతో కొంత ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతున్న ఎనిమిదో తరగతి లోపు విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్ షిప్ ను రద్దు చేయవద్దని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచన చేశారు. ఒకవేళ అలా చేస్తే పేద విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు .
కేంద్ర ప్రభుత్వ విధానాలు బీసీ వర్గాలకు ఎంబీసీ వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ గిరిజన వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఈ వర్గాల విద్యార్థులకు చదువును అందకుండా దూరం చేసే కుట్రలో భాగమే ఈ నిర్ణయం అన్నారు. ప్రస్తుతం ఉచిత నిర్బంధ విద్యను సాకుగా చూపి కేవలం 9వ 10 తరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్ లను పరిమితం చేసే కుట్రలను ప్రజలందరూ తీపి కొట్టాలని ఆయన కోరారు. దేశంలో 100% అక్షరాస్యత సాధించాలంటే విద్యకు వ్యతిరేకమైన నిర్ణయాలను ఉపసంహరించుకోవాలన్నారు. తరతరాలుగా విద్యకు దూరం అయిన ఈ వర్గాలే నేటికీ సమాజంలో వివక్షకు పీడనకు దోపిడీ అవుతున్న వర్గాలను సమాజంలో అన్ని రంగాలలో సమాన అవకాశాలను కల్పించాలంటే విద్యను ప్రోత్సహించడమే ప్రధాన కర్తవ్యం అన్నారు. దురదృష్టవశాత్తు కేంద్రం ఈ వర్గాలను చదువుకోకుండా చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నం అత్యంత దురదృష్టకరమని అది ఈ దేశం యొక్క అభివృద్ధికి గొడ్డలి పెట్టి లాంటిదని బీసీ కమిషన్ సభ్యులు అన్నారు