శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ టైమింగ్స్ మారాయి. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు దర్శనం వేళలలో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు , సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి వరకు అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో పాటు కరోనా ఆంక్షలు లేకపోవడంతో రెండో భాగంలో దర్శన సమయాన్ని మార్చారు.
ఇక నుంచి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకే స్వామి వారి దర్శనం కల్పించను న్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 16 న శబరిమల ఆలయం తెరవగా.. సోమవారం వరకు 3 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చినట్టు చెప్పారు. సోమవారం ఒక్కరోజే 70 వేల మంది భక్తులు వచ్చారని పేర్కొన్నారు.
అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం డిసెంబరు(DEC), జనవరి(JAN) నెలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 38 శబరిమల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ద.మ రైల్వే ప్రకటించింది. హైదరాబాద్-కొల్లాంకు DEC 5, 12, 19, 26, JAN 2, 9, 16 తేదీల్లో.. కొల్లాం-హైదరాబాద్‌కు DEC 6, 13, 20, 27, JAN 3, 10, 17.. నర్సాపూర్-కొట్టాయం DEC 2, 9, 16, 30, JAN 6, 13.. కొట్టాయం-నర్సాపూర్ DEC 3, 10, 17, 24, JAN 7, 14.. సికింద్రాబాద్-కొట్టాయం DEC 4, 11, 18, 25, JAN 1, 8.. కొట్టాయం-సికింద్రాబాద్ DEC 4, 11, 18, 25, JAN 2, 9 తేదీల్లో రైళ్లు బయలుదేరుతాయి.