Sunday, January 19, 2025
HomeసినిమాJawan: 'జవాన్' లో బన్నీ నిజంగా నటిస్తున్నారా..?

Jawan: ‘జవాన్’ లో బన్నీ నిజంగా నటిస్తున్నారా..?

షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జవాన్’. ఇందులో షారుఖ్ కు జంటగా నయనతార నటిస్తుంది. విజయ్ సేతుపతి, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ, క్రేజీ మూవీని అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా పై క్రేజ్ ఏర్పడింది. ఇటీవల వచ్చిన షారుఖ్ మూవీ పఠాన్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో జవాన్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

అయితే… ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారని గతంలో టాక్ వినిపించింది. ఆ తర్వాత బన్నీ పుష్ప-2 షూటింగ్ లో బిజీగా ఉండడంతో… సున్నితంగా తిరస్కరించారని వార్తలు వచ్చాయి. బన్నీ నో చెప్పడంతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తో బన్నీతో చేయించాలి అనుకున్న క్యారెక్టర్ ను చేయించనున్నారని టాక్ వచ్చింది. తాజా వార్త ఏంటంటే… జవాన్ సినిమాలో అల్లు అర్జున్ అతిథి పాత్రలో నటిస్తున్నాడట. అంతేకాదండోయ్… ఈ సినిమా కోసం బన్నీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

త్వరలోనే బన్నీ లుక్ అలాగే టీజర్ విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి చిత్రబృందం ఎలాంటి విషయాలను వెల్లడించ లేదు కానీ ఇదే నిజమై అల్లు అర్జున్ షారుఖ్ సినిమాలో కనిపిస్తే మాత్రం సూపర్ గా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కూడా క్యామియో రోల్ లో మెరవనున్నారు. షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పుటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. జవాన్ మూవీ జూన్ 2వ తేదీన హిందీతో పాటు తమిళం తెలుగు మలయాళ కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్