Sunday, September 29, 2024
Homeసినిమాఏప్రిల్ కి వెళ్లిన 'శాకుంతలం' .. న్యూ రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్!  

ఏప్రిల్ కి వెళ్లిన ‘శాకుంతలం’ .. న్యూ రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్!  

గుణశేఖర్ కి చారిత్రక .. పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో మంచి అనుభవం ఉంది. కథకి తగినట్టుగా పాత్రలు ఎలా ఉండాలి? అవి ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలపై మంచి అనుభవం ఉంది. ‘బాలల రామాయణం’ .. ‘రుద్రమదేవి’ వంటి సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. అలాంటి గుణశేఖర్ నుంచి రావడానికి ‘శాకుంతలం’ సిద్ధమవుతోంది. మహాకవి కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు.

సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 17వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుందనగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేశామనీ .. న్యూ రిలీజ్ డేట్ త్వరలో చెబుతామని ఒక లెటర్ వదిలారు. తాజాగా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుని ఎనౌన్స్ చేసేశారు. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చెప్పారు.

నిజానికి ఈ నెల 17వ తేదీన ధనుశ్ ‘సార్’ మినహా పెద్ద సినిమాలేవీ లైన్లో లేవు. ఆ తరువాత వారం కూడా చిన్న సినిమాలే వెయిటింగులో  ఉన్నాయి.  మరి అలాంటప్పుడు ‘శాకుంతలం’ సినిమా రిలీజ్ ను ఏప్రిల్ 14కి ఎందుకు వాయిదా వేశారనేది తెలియదు. గుణశేఖర్ తో పాటు దిల్ రాజు కూడా ఒక నిర్మాతగా ఉన్న ఈ సినిమాలో భారీ తారాగణమే ఉంది. ఈ సినిమా తరువాత సమంత గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందనే ఆశతో .. ఆలోచనతో అభిమానులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్