Sunday, January 19, 2025
Homeసినిమా‘దక్ష’ టైటిల్ లోగో ఆవిష్కరించిన తనికెళ్ళ భరణి, శరత్ బాబు

‘దక్ష’ టైటిల్ లోగో ఆవిష్కరించిన తనికెళ్ళ భరణి, శరత్ బాబు

Daksha:
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాత గా, వివేకానంద విక్రాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం  దక్ష. ఈ సినిమా ద్వారా సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగో ను సీనియర్ నటులు తనికెళ్ళ భరణి, శరత్ బాబు విడుదల చేశారు.

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ “దక్ష అంటే అన్ని వ్యవహారాలు సమన్వయం చేసేవాడు అని అర్థం. అతనే మా తల్లాడ సాయి కృష్ణ. తను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాడు. గతంలో తాను డైరెక్ట్ చేసిన ఒక వ్యవసాయ షార్ట్ ఫిలింకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. చాలా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి రావటం చాలా గొప్పవిషయం. ఈ దక్ష చిత్రంలో మన శరత్ బాబు గారి తనయుడు ఆయుష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. శరత్ బాబు గారు నాకు మంచి మిత్రుడు. ఎన్నో చిత్రాల్లో కలిసి పని చేశాం. ఆయుష్ కి ఈ చిత్రం మంచి విజయం అందించాలని, ఈ సినిమాలో పని చేసిన నటులకు టెక్నిషన్స్ అందరికి మంచి అవకాశాలు రావాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

శరత్ బాబు మాట్లాడుతూ “ఆయుష్ నా తమ్ముడి కొడుకు. నా కొడుకు కూడా. ఆయుష్ కి ఈ చిత్రం మంచి విజయం సాదించాలి అని కోరుకుంటున్నాను. ఈ చిత్రం టైటిల్ లోగో కార్యక్రమానికి తనికెళ్ళ భరణి గారు గెస్ట్ గా రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాదించాలి. నిర్మాతలకి మంచి డబ్బు సంపాదించి పెట్టాలి. దర్శకుడుకి మంచి విజయం అందించాలి అని కోరుకుంటున్నాను” అన్నారు.

Also Read : ‘అఖండ‌’కు అనూహ్య స్పంద‌న‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్