Saturday, January 18, 2025
Homeసినిమామ‌హేష్‌, రాజ‌మౌళి మూవీలో సాహో హీరోయిన్?

మ‌హేష్‌, రాజ‌మౌళి మూవీలో సాహో హీరోయిన్?

Shraddha In?:  సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే.  ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. జ‌న‌వ‌రిలో ఈ మూవీ షూటింగ్ గ్రాండ్ గా ప్రారంభించ‌నున్నార‌ని స‌మాచారం.

ఈ కాంబినేషన్ కోసం ద‌శాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు సినిమాకు సంబంధించిన  అప్ డేట్స్ కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ సాహో మూవీలో న‌టించిన‌ శ్రద్ధాకపూర్ అయితే  ఈ సినిమాకు పర్ ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని దర్శక ధీరుడు రాజమౌళి ఆలోచిస్తున్నట్లు సమాచారం.

సాహో సినిమా తర్వాత శ్రద్ధా కపూర్ కు కొన్ని పాన్ ఇండియా ఆఫర్లు వచ్చినప్పటికి కూడా కథలు నచ్చకపోవడంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళి మూవీ అంటే ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని చెప్పవచ్చు. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మేనా..?  కాదా.? అనేది తెలియాల్సివుంది.

Also Read : మ‌హేష్ డ‌బుల్ రోల్? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్