Sunday, June 14, 2026
Homeసినిమాసిరివెన్నెల రాసిన చివరి పాట విడుద‌ల‌

సిరివెన్నెల రాసిన చివరి పాట విడుద‌ల‌

Sirivennela – Last song :
లెజెండ‌రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి చివ‌రి పాట న్యాచులర్ స్టార్ నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా కోసం రాశారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. శాస్త్రి గారి అంతిమ సంస్కారాలు నిర్వహించిన రోజున సిరివెన్నెల పాట రికార్డ్ చేయబడింది. శ్యామ్ సింగ రాయ్ సినిమాను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి అంకితం ఇచ్చారు మేక‌ర్స్‌. ఈ రోజు సిరివెన్నెల చివ‌రి పాట‌ను విడుద‌ల చేశారు.

నాని, సాయి పల్లవిల మధ్య ఉన్న ఆహ్లాదకరమైన ప్రేమ కథను చిత్రీకరించే ఈ మనోహరమైన పాట‌కు మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. నాని, సాయి ప‌ల్ల‌వి కేవ‌లం రాత్రుల‌లోనే క‌లుస్తారు. నానితో ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంది సాయి ప‌ల్ల‌వి. వారిద్ద‌రి మ‌ధ్య క్లాసిక్ కెమిస్ట్రీ ఈ పాట‌కు మ‌రింత అందాన్ని తెచ్చింది. సిరివెన్నెల గారి సాహిత్యం లోతైన అర్థాన్ని కలిగి ఉంది. అనురాగ్ కులకర్ణి ఈ పాటను మనోహరంగా పాడారు.

సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన‌ ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.

Also Read : ‘భీమ్లానాయ‌క్’ రిలీజ్ పై మ‌రోసారి క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular