Saturday, January 18, 2025
Homeసినిమాఫ్రెంచ్ కంపెనీతో జతకట్టిన సితార

ఫ్రెంచ్ కంపెనీతో జతకట్టిన సితార

Sitara Entertainments To Produce An International Film Titled Tamara :

టాలీవుడ్ ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ తొలిసారిగా అంతర్జాతీయ చిత్రాన్ని ‘తామర ‘ పేరుతో నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ.  ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు అయిన రవి. కె. చంద్రన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల క్రేజీ కాంబినేషన్లో ‘భీమ్లా నాయక్‘ చిత్రానికి డివోపిగా పనిచేస్తున్నారు.

‘తామర’ ప్రచార చిత్రంలో ఓ అమ్మాయి తల ఓ పక్కకు తిప్పుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ చిత్రం కథ, కథనాలు అత్యంత ఉత్సుకతను కలిగిస్తాయని తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ‘జెర్సీ‘ చిత్రం జాతీయ పురస్కారం అందుకున్న నేపథ్యంలో ఇప్పుడీ అంతర్జాతీయ చిత్ర నిర్మాణం సినీ వర్గాలలో అమితాసక్తిని కలిగిస్తోంది. నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగ వంశీ.

ఇవి కూడా చదవండి: భీమ్లా నాయక్ వీడియో ప్రొమో అదిరింది

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్