Saturday, January 18, 2025
Homeసినిమాశివకార్తికేయన్ 'ప్రిన్స్' ఫస్ట్ లుక్ విడుదల

శివకార్తికేయన్ ‘ప్రిన్స్’ ఫస్ట్ లుక్ విడుదల

Title: వెర్సటైల్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా- ట్యాలెంటడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. టైటిల్‌ను ప్రకటించడమే కాకుండా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్ లుక్ లో వైట్ అండ్ వైట్ ధరించిన శివకార్తికేయన్ చేతిలో గ్లోబ్‌తో శాంతించే ప్రభోదించే వ్యక్తిలా కనిపించడం ఆసక్తికరంగా వుంది. కంట్రీ మ్యాప్‌లతో పెయింట్ చేయబడ్డ చేతులు, ప్రపంచ పటం, శాంతికి చిహ్నంగా ఉన్న పావురం నేపధ్యం వుండటం ఇంకా ఆసక్తిగా వుంది.

శివకార్తికేయన్ చిరునవ్వులానే ఫస్ట్ లుక్ చాలా పాజిటివ్ వైబ్ తో వుంది. ఈ ఫస్ట్ లుక్ లో చిరునవ్వు చిందిస్తూ అచ్చూ ‘ప్రిన్స్’ లా కనిపించారు శివకార్తికేయన్. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న సినిమాపై ఫస్ట్ లుక్ మరింత ఆసక్తిని పెంచింది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 31న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమా కథ భారతదేశంలోని పాండిచ్చేరి, బ్రిటన్‌లోని లండన్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో మరియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Also Read : శివకార్తికేయన్ స‌ర‌స‌న‌ ఉక్రేనియన్ బ్యూటీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్