Saturday, April 20, 2024
HomeTrending Newsఇండియాలో స్పుత్నిక్ సింగల్ డోస్ టీకా

ఇండియాలో స్పుత్నిక్ సింగల్ డోస్ టీకా

భారత దేశంలో స్పుత్నిక్ లైట్ సింగల్ డోస్ టీకా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే స్పుత్నిక్ వి భారత దేశంలో అందుబాటులో ఉందని, సింగిల్ డోసు వ్యాక్సిన్ స్పుత్నిక్ లైట్ కూడా కొద్ది రోజుల్లోనే వస్తుందని భారత్ లో  రష్యా రాయబారి నికోలాయ్ కుడశేవ్ వెల్లడించారు. అంతర్జాతీయంగా భారత, రష్యాల  వ్యాక్సిన్లకు గుర్తింపు కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. వచ్చే నెలలో భారతదేశం అధ్యక్షతన జరిగే ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో రెండు దేశాలు సమన్వయంతో వివిధ అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సి ఉందన్నారు.

మరోవైపు స్పుత్నిక్ వి ఒక డోసు అస్త్రజేనేకా మరొక డోసు కలిపి ఇవ్వటంపై పరిశోధనలు జరుగుతున్నాయని ఈ నేలాఖరుకు ఫలితాలు వస్తాయని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (RDIF) ప్రకటించింది. ఇండియాలో స్పుత్నిక్ వి – కొవిశీల్డ్  కలిపి ఇచ్చేందుకు ప్రస్తుత పరిశోధనలు ఉపయోగపడతాయని RDIF సి.ఈ.ఓ కిరిల్ ద్మిత్రివ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశోధనల అనంతరం రెండింటి మిక్స్ మ్యాచ్ టీకా ఉత్పత్తి సిరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా (SII) నుంచే జరగుతుందని కిరిల్ ద్మిత్రివ్ పేర్కొన్నారు.

సిరం సంస్థ నుంచి మొదటి బ్యాచ్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సెప్టెంబర్ లో రానున్నాయి. ఏడాదికి 300 మిలియన్ ల స్పుత్నిక్ వి టీకాలు భారతదేశంలో ఉత్పత్తి కానున్నాయి. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సంస్థ ఇండియాలో గ్లాండ్ ఫార్మ, హెటేరో బయో ఫార్మ, పనసియా బయోటెక్, స్టేలిస్ బయో ఫార్మా, విర్చో బయోటేక్, మొరేపెన్ కంపెనీలతో స్పుత్నిక్ వి ఉత్పత్తికి ఒప్పందం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్