Wednesday, April 2, 2025
Homeస్పోర్ట్స్సూర్య కుమార్ యాదవ్ కూడా ఔట్!

సూర్య కుమార్ యాదవ్ కూడా ఔట్!

Surya injured: శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ కు దీపక్ చాహర్ తో పాటు బాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా దూరమయ్యాడు.  వెస్టిండీస్ తో జరిగిన  చివరి టి20 మ్యాచ్ లో తోడ కండరాల గాయంతో చాహర్  దూరం కాగా సూర్య కుమార్ ఫీల్డింగ్ సమయంలో కాలి కండరానికి దెబ్బ తగిలింది.  దీనితో ఇద్దరూ లంక టోర్నీకి దూరమయ్యారు. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది.   గాయాలకు తగిన చికిత్స తీసుకునేందుకు ఇద్దరినీ బెంగుళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీ కి పంపుతున్నట్లు బిసిసిఐ వెల్లడించింది.

ఇప్పటికే సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్,  కెఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్ లు దూరం కాగా ఇప్పుడు చాహార్, అయ్యర్ లు కూడా దూరమయ్యారు.  జట్టులో కొత్తగా చేరిన రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్ లకు తమ సతా చాటేందుకు లంక సిరీస్ అవకాసం ఇస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్