Sunday, January 19, 2025
Homeసినిమా'సూర్యా పేట్ జంక్షన్' ఐటమ్ సాంగ్ విడుదల

‘సూర్యా పేట్ జంక్షన్’ ఐటమ్ సాంగ్ విడుదల

యోగ లక్ష్మీ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం పై అనిల్ కుమార్ ఎన్. శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘సూర్యా పేట్ జంక్షన్‘. ఈ చిత్రానికి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈశ్వర్ హీరోగా నైనా సర్వార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ గర్ల్ పూజ (అర్.ఎక్స్ 100 ఫేమ్) అభిమన్య సింగ్ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఐటమ్ సాంగ్ సిసిసి క్రికెట్ కప్ విన్నర్స్ చేతుల మీదుగా విడుదల అయ్యింది ఈ కార్యక్రమానికి. సిసిసి బాలీవుడ్ టీమ్ టాలీవుడ్ టీమ్ సిసిసి అధ్యక్షుడు షకీల్ మరియు ‘సూర్యా పేట్ జంక్షన్’ హీరో ఈశ్వర్ హీరోయిన్ నైన సర్వార్ ఐటమ్ సాంగ్ గర్ల్ పూజా ఆర్టిస్ట్ హరిష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ.. మా ‘సూర్యా పేట్ జంక్షన్’ మ్యాచింగ్ మ్యాచింగ్ సాంగ్ విడుదల చేసే అవకాశం ఇచ్చిన సీసీసీ అధ్యక్షులు షకీల్ గారికి మా సాంగ్ లాంచ్ చేసిన టాలీవుడ్ టీమ్ బాలీవుడ్ టీమ్ కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఈ చిత్ర ఆడియో టిప్స్ తెలుగు ద్వారా ఆడియో విడుదల అవుతుంది. మా చిత్రం త్వరలోనే విడుదలకు రెడీ అవుతున్నాం. ప్రమోషన్స్ లో భాగంగా ‘మ్యాచింగ్ మ్యాచింగ్’ సాంగ్ ఓన్ కంపోజ్ లో రీల్ చేసి మా యోగ లక్ష్మీ ఆర్ట్స్ క్రియేషన్స్ సోషల్ మీడియా అకౌంట్ కి హ్యాష్‌ ట్యాగ్ చెయ్యాలి. దానికంటే ముందు మా టీజర్ ని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి రిజిష్టర్ అవ్వాలి. అలా చేసిన టాప్ రీచ్ వచ్చిన వీడియోకి ఒక లక్ష రూపాయల ప్రైజ్ మని ఫస్ట్ బెస్ట్ రీల్ చేసిన 10 వీడియోస్ కి ఒక్కోకరికి 10 వేల సెకెండ్ బెస్ట్ 10 రీల్స్ కి ఒక్కొకరికీ 5వేల రూపాయలు ఇవ్వనున్నాం. ఈ కాంటెస్ట్ రీల్స్ నీ 10 రోజుల లోపు పంపించాలి అని తెలిపారు అన్నారు.

Also Read : ‘సూర్యాపేట్ జంక్షన్’ షూటింగ్ పూర్తి

RELATED ARTICLES

Most Popular

న్యూస్