Saturday, January 18, 2025
Homeసినిమా'స్వాతిముత్యం' ప్రచార చిత్రం విడుదల

‘స్వాతిముత్యం’ ప్రచార చిత్రం విడుదల

బెల్లంకొండ గణేష్ హీరోగా  సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం‘. వర్ష బొల్లమ్మ కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రోజు గణేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టీజర్ ట్రైలర్ పేరుతో ఓ సంక్షిప్త ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది యూనిట్. దాదాపు నలభై క్షణాల పాటు సాగే ఈ దృశ్య మాలిక ఆద్యంతం సరదాగా సాగుతూ వినోదాన్ని పంచుతుంది.

” మన బాలూ ఏంచేసాడో కొంచం నీకర్థమయ్యేలా చెబుతాను…
చెప్పండి…
అంటే …..అదీ….!
కొంపదీసి ఏదన్నా ప్రాబ్లమా
ప్రాబ్లమా.. ప్రాబ్లమ్ ఏముంటుందండి…?
మీరింకా సింగిల్ గా ఎందుకుండిపోయారో నా కిప్పుడర్ధమయింది” వంటి సంభాషణలు నాయిక, నాయకుల మధ్య వినిపిస్తాయి. రావు రమేష్, వెన్నెల కిషోర్ లు కూడా ఇందులో కనిపిస్తారు. చిత్రం థియేట్రికల్ ట్రైలర్ త్వరలోనే విడుదల అన్న ప్రకటనతో పాటు, దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు స్వాతిముత్యం’ ను అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రచార చిత్రంలో ఈ విషయాన్ని కూడా గమనించవచ్చు.

Also Read : స్వాతిముత్యం నుంచి పెళ్లి గీతం

RELATED ARTICLES

Most Popular

న్యూస్